బాల్యానికి భరోసా

Screening‌ Tests For Childrens Under RBSK For YSR Kanti Velugu - Sakshi

చిన్నారులకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్‌ పరీక్షలు

12 నెలల్లో 1.22 కోట్లమందికి ఆరోగ్య పరీక్షలు

రెండుదశల పరీక్షల్లో పలువురు పిల్లల్లో లోపాల గుర్తింపు

వీటిని అధిగమించేందుకు ప్రత్యేక వైద్యచికిత్సకు సిఫార్సు

వైఎస్సార్‌ కంటివెలుగు కింద మరో 66 లక్షలమందికి పరీక్షలు

సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి వైద్యమందిస్తే పెద్దయ్యాక దుష్ప్రభావాలు కనిపించవనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. గత 12 నెలల్లో ఐదు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న సుమారు 1.22 కోట్ల మందికి ప్రాథమిక స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్‌కే) కింద చేపట్టిన ఈ పరీక్షల్లో పలువురు చిన్నారుల్లో లోపాలు గుర్తించారు. వారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు.

ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన లోపాలు గుర్తించి వారికి వయసొచ్చాక ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లు,కళాశాలల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎక్కువగా పదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లోనే సమస్యలు కనిపించాయి.

దేశంలోనే గొప్పగా కంటివెలుగు కార్యక్రమం
చిన్నారులకు వైద్య పరీక్షలే కాదు.. ‘వైఎస్సార్‌ కంటివెలుగు’లో భాగంగా 66 లక్షలమందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో సమస్యలున్న 55 వేలమందికి విజన్‌కిట్స్‌ పంపిణీ చేశారు. 1.58 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది. 9,666 మంది చిన్నారులను పెద్దాస్పత్రులకు పంపి చికిత్స చేయించింది. ఎప్పట్నుంచో చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతుండగా నేరుగా స్కూళ్లకే వెళ్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇచ్చింది మొదటగా మన రాష్ట్రంలోనే.

ఆర్బీఎస్‌కే కింద పరీక్షల వివరాలు

మొదటి దశలో స్క్రీనింగ్‌  62,83,203
పుట్టుకతోనే లోపాలున్నవారు 46,627
శారీరక లోపాలతో ఉన్నవారు 36,614
జబ్బులతో బాధపడుతున్నవారు     44,288
ఎదుగుదలలో లోపాలు  9,322
రెండోదశలో స్క్రీనింగ్‌ 59,99,438
పుట్టుకతోనే సమస్యలున్నవారు     10,439
రకరకాల శారీరక లోపాలున్నవారు  8,921
జబ్బులతో బాధపడుతున్నవారు 54,548
ఎదుగుదల లోపాలున్నవారు 30,084

వైఎస్సార్‌ కంటివెలుగు కింద
 

మొత్తం స్కూళ్లు 60,406
స్క్రీనింగ్‌ చేయించుకున్న విద్యార్థులు 66 లక్షలు
అద్దాలు తీసుకున్నవారు 1.58 లక్షలు
పెద్దాస్పత్రులకు సిఫార్సు 9,666
విజన్‌కిట్‌లు తీసుకున్నవారు     55,000

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top