వైవీయూ గూటికే ‘గురుకులం’ 

Yogi Vemana University Will Get 21st Century Gurukulam Buildings - Sakshi

8 బ్లాక్‌లను విశ్వవిద్యాలయానికి అప్పజెబుతూ ఉత్తర్వులు 

సాక్షి, వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం గూటికి 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు వచ్చి చేరనున్నాయి. ఈ మేరకు ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 8 బ్లాక్‌లతో వైవీయూలో 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు ఏర్పాటు చేశారు. ఈ భవనాల నుంచి ఇడుపులపాయ ట్రిపుల్‌ వరకు నాలెడ్జ్‌హబ్‌గా  తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు.

అయితే కాలక్రమంలో ఇడుపులపాయలో ప్రత్యేకంగా భవనాలు నిర్మించడంతో వీటి అవసరం లేకుండా పోయింది. దీంతో వీటిని వైవీయూ నుంచి వేరుచేసి స్కిల్‌డెవలప్‌మెంట్‌ వారికి అప్పజెప్పారు. దీంతో ఈ భవనాలను ఎన్‌జీఓల ఆధ్వర్యంలో నడుస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ భవనాల్లోని రెండు బ్లాక్‌లను మాత్రం వైవీయూ అధికారులు కామర్స్, మేనేజ్‌మెంట్‌ బ్లాక్‌లుగా, పరిశోధన అవసరాల కోసం వినియోగించుకుంటూ వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top