‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా | ycps fee battle postponed to march 12: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా

Feb 4 2025 5:12 AM | Updated on Feb 4 2025 5:12 AM

ycps fee battle postponed to march 12: Andhra pradesh

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ వెల్లడి 

సాక్షి, అమరావతి: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో  ఎన్నికల ప్రక్రియ ముగిశాక  మార్చి 12న ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం’ అని వైఎస్సార్‌సీపీ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement