నిబంధనల మేరకే నామినేషన్ల ఉపసంహరణ

Withdrawal of nominations as per rules - Sakshi

ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు

అందువల్ల ఎన్నికల నిలుపుదలకు ఉత్తర్వులివ్వొద్దు

హైకోర్టుకు నివేదించిన ఎస్‌ఈసీ 

సాక్షి, అమరావతి: తమకు తెలియకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లను ఉప సంహరించారని, అందువల్ల తమ డివిజన్లలో ఎన్నికలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 18 డివిజన్లకు చెందిన టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వ లేదు. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అంతకు ముందు ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. పిటిషనర్లకు సంబంధించిన ప్రతిపాదితులే వారి నామినేష న్లను ఉపసంహరించారని తెలిపారు. అందు వల్ల ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ జోక్యం చేసుకుని.. ఈ 18 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారు లు ఫారం–10 జారీచేశారని తెలిపారు.

తిరుపతి 7వ డివిజన్‌పై విచారణ వాయిదా
తిరుపతి 7వ డివిజన్‌ ఎన్నికల నిలిపివేతను సవాలు చేస్తూ ఆ డివిజన్‌లో నామినేషన్‌ వేసిన సుజాత దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఈనెల 15కి వాయిదా వేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top