Whip Meeting MLAs Special Focus On Jagananna Illa Nirmanam- Sakshi
Sakshi News home page

జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేల ప్రత్యేక దృష్టి

Jul 30 2021 8:50 AM | Updated on Jul 30 2021 12:27 PM

Whip Meeting MLAs Special Focus On Jagananna Illa Nirmanam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ప్రభుత్వ విప్‌ల సమావేశం నిర్ణయించింది. చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిర్మాణానికి సంబంధించి ఇసుక, కంకరకు కొరత లేకుండా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ బృహత్తర కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేసేందుకే సమావేశం జరిగిందని శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement