వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు

Vidadala Rajini Takes Charge As Minister Of Health - Sakshi

సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖ మంత్రిగా  విడదల రజిని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్.. ఎవ్వరు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్‌ వెంటే ఉంటారని విడదల రజిని అన్నారు.

చదవండి: ఉంగరం దొంగలు మీరేనా?

రాజకీయ నేపథ్యం:
హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో ప్రాసెస్‌ వీవర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2018లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top