
రహదారికి ఎడమవైపు పేరాయిపల్లె గ్రామ సర్పంచ్ నాగలక్ష్మమ్మ, కుడివైపు గోపాలపురం సర్పంచ్ రామలక్ష్మమ్మ
ఇక్కడ మాత్రం రోడ్డుకు అటు, ఇటు ఉండటం విశేషం. ఆళ్లగడ్డ మండలంలో గోపాలపురం, పేరాయిపల్లె పంచాయతీలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి.
ఆళ్లగడ్డ రూరల్: ఎక్కడైనా రెండు పంచాయతీలు కనీసం రెండు కి.మీ. దూరంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం రోడ్డుకు అటు, ఇటు ఉండటం విశేషం. ఆళ్లగడ్డ మండలంలో గోపాలపురం, పేరాయిపల్లె పంచాయతీలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. గోపాలపురం గ్రామం నల్లగట్ల రెవెన్యూ పరిధిలో, పేరాయిపల్లె జంబులదిన్నె రెవెన్యూ పొలిమేర పరిధిలో ఉండటంతో వేర్వేరు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఒకే ఊరులా కనిపించే ఈ గ్రామాలు వేర్వేరు పంచాయతీలు. పేరాయిపల్లె గ్రామం 1995 వరకు జి.జంబులదిన్నె గ్రామ పంచాయతీలోనే ఉండేది. తర్వాత జనాభా 500 పైగా పెరగడంతో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇటీవల జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గోపాలపురం సర్పంచ్‌గా రామలక్ష్మమ్మ, పేరాయిపల్లె గ్రామ సర్పంచ్‌గా నాగలక్ష్మమ్మ ఎన్నికయ్యారు.
(చదవండి: ఆ కుటుంబం ఓటమి ఎరగదు..)
హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!