టీటీడీ విధానాలే మిగతా ఆలయాల్లోనూ..

TTD policies also to impliment other temples - Sakshi

దేవదాయ శాఖ వర్క్‌షాప్‌లో విధివిధానాల రూపకల్పన

సాక్షి, అమరావతి: భక్తులకు సౌకర్యాల కల్పన, ప్రసాదాల పంపిణీ, దేవుడి ఆస్తుల పరిరక్షణ తదితర అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కొనసాగుతున్న మంచి విధానాలు మిగిలిన ఆలయాల్లోనూ అమలు చేసేందుకు దేవదాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని ప్రముఖ ఆలయాల ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు, ఆర్‌జేసీ స్థాయి అధికారులతో బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పాల్గొన్నారు. టీటీడీలో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు కమిషనర్‌ కార్యాలయ సీనియర్‌ స్థాయి అధికారులు కొందరు రెండు నెలల కిత్రం రెండు విడతలుగా తిరుమలను సందర్శించిన విషయం తెలిసిందే. 

అక్కడికి వెళ్లి అధ్యయనం చేసిన అంశాలపై ఆయా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌వోపీ– పూర్తి స్థాయి విధివిధానాలు)ను ఈ వర్క్‌షాప్‌ సందర్భంగా రూపొందించినట్టు కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఖరారు చేసిన విధి విధానాలను అన్ని ఆలయాల్లో అమలు చేసేలా దేవదాయ శాఖ ఈవోలందరికీ ఉత్తర్వులిస్తామని ఆయన వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top