ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు

TTD Chairman YV Subba Reddy Press Meet Divya Darshan Tokens - Sakshi

సాక్షి, తిరుమల: భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/` దర్శన టికెట్లు తగ్గించనున్నారు.
ఈ మూడు నెలల పాటు వీఐపీలు సిఫారసు లేఖలను తగ్గించేలా చూడటం.
ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు  కాలకుండా కూల్‌ పెయింట్‌.
తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగింది.
► మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం.
అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచడం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు.
ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు.
భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ.
టీటీడీ విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడటం.
శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించడం.
చదవండి: ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు.. సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top