
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేడర్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ), ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న కే. విజయా నంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బి. రాజశేఖర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.