Punganur Cow: తెనాలిలో రూ.4.10 లక్షలు పలికిన పుంగనూరు పొట్టి ఆవు

Tenali Man Sells Punganur Cow For Rs 4 lakhs - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అరుదైన పుంగనూరు జాతి పొట్టి ఆవును రూ.4.10 లక్షలకు హరిద్వార్‌లోని బాబా రామ్‌దేవ్‌ ఆశ్రమం కొనుగోలు చేసింది. తెనాలి పట్టణంలోని రామలింగేశ్వపేటకు చెందిన కంచర్ల శివయ్య దేశవాళీ ఆవులను పెంచుతున్నారు. ఆయన దగ్గర ఒంగోలు, పుంగనూరు, కపిల, సాహిల్, గిర్‌ జాతి ఆవులు వంద వరకు ఉన్నాయి.

ఇందులోని ఒక పుంగనూరు ఆవును ప్రముఖ యోగాచార్యుడు, పతంజలి ఆయుర్వేద మందుల ఉత్పత్తిదారు అయిన బాబా రామ్‌దేవ్‌ ఆశ్రమం కొనుగోలు చేసింది. మూడున్నర సంవత్సరాల వయసు గల తొలి చూడి ఆవును రూ.4.10 లక్షలకు విక్రయించినట్టు శివయ్య కుమారుడు కంచర్ల శివకుమార్‌ వెల్లడించారు. ఆదివారం ఈ ఆవును ప్రత్యేక వ్యానులో హరిద్వార్‌ తరలించారు. 
చదవండి: సీజన్‌ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top