మళ్లీ జగనే కావాలి.. | Sakshi
Sakshi News home page

మళ్లీ జగనే కావాలి..

Published Sun, Nov 19 2023 5:42 AM

Telugu IT employees who made a splash in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి :రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఎలుగెత్తి చాటేందుకు.. ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్, లోకేశ్, ఎల్లో మీడియాల దుష్ప్రచారాలను ఎండగట్టేందుకు ఐటీ ఉద్యోగులు విజయవాడలో కదంతొక్కారు. రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చబ్యాచ్‌ అనుసరిస్తున్న తీరుపై వారు విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం పిలుపు మేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగులు శనివారం పెద్దఎత్తున విజయవాడలో జరిగిన జగనన్న ప్రగతి పథం ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి వీరి నుంచి అనూహ్య స్పందన లభించింది. పలు ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమానికి తరలిరావడంతో బెజవాడ బందరు రోడ్డు జనసంద్రంలా మారింది. జై జగన్‌ అంటూ నినాదాలతో హోరెత్తింది. ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమై పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని వైఎస్సార్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. “వీ వాంట్‌ జగన్‌’ అంటూ పెద్దఎత్తున ముక్తకంఠంతో నినదించారు.

అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాల్లోని 12 అంశాలతో కూడిన ప్లకార్డులను చేబూని ర్యాలీగా వారంతా ముందుకు సాగారు. ఆ వెనకాలే బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా దాడిని తిప్పికొడతామని.. సంక్షేమ సారథి వైఎస్‌ జగన్‌ను 2024 ఎన్నికల్లోనూ గెలిపించుకుంటామని వారు ప్రతినబూనారు. ర్యాలీ వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరుకోగానే పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్‌ రాష్ట్రంలో చేసిన ప్రగతిని ఈ సందర్భంగా ఐటీ ప్రొఫెషనల్స్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

ప్రభుత్వ విజయాలను చాటిచెప్పడమే లక్ష్యం..
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం అధ్యక్షుడు పి. సునీల్‌కుమారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నాలుగన్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి–సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకే రాష్ట్రంలో “జగనన్న ప్రగతిపథం్ఙ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వ విజయాలను చాటిచెప్పడమే ఈ కార్యక్రమం లక్ష్యమమన్నారు.

జగనన్న ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రహదారులు, ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరిగిందని, దీంతోపాటు.. రాష్ట్రానికి రూ.13.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే, ఇకపై చంద్రబాబు అండ్‌ కో ను జగనన్న ఐటీ సైన్యం ఎప్పటికప్పుడు అడ్డుకుంటుందని హెచ్చరించారు.

మంచిని దాచి పచ్చ మీడియా దుష్ప్రచారం..
ఇక పారిశ్రామికరంగంలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందని వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జి మంజునాథ్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం కోఆర్డినేటర్లు కుమారస్వామిరెడ్డి, రోశిరెడ్డి చెప్పారు. జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని దాచి, చంద్రబాబు ఎల్లో మీడియా అబద్ధాలను ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చారన్నారు.

ఐటీ కంపెనీలు కడుతుంటే, వాటిని ఓయో రూములంటూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న ప్రభుత్వం 60,000 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌లు (ఐఎఫ్‌పీ), 10,000 స్మార్ట్‌ టీవీలను ఏర్పాటుచేసి తరగతి గదులను డిజిటల్‌ లెర్నింగ్‌ స్పేస్‌లుగా మార్చిందని.. అలాగే, విద్యార్థులకు 5.8 లక్షల బైజూస్‌ టాబ్‌లను అందించిందన్నారు.     

99.5 శాతం హామీలు అమలుచేసిన ఏకైక సీఎం జగన్‌..
ఈ నాలుగున్నరేళ్ల పాలనలో మేనిఫెస్టోలోని దాదాపు 99.5 శాతం హామీలను పూర్తిచేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌. కానీ.. దుష్టచతుష్టయం, ఎల్లో మీడియా జగన్‌ చేసిన అభివృద్ధి–సంక్షేమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. అందుకే వైఎస్సార్‌సీపీ ఐటీ ఆధ్వర్యంలో జగనన్న ప్రగతిపథం కార్యక్రమం ప్రారంభించాం. ఐటీ ఉద్యోగులందరం మౌత్‌ ప్రచారం చేయాలని నిర్ణయించాం. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరిస్తాం. వైఎస్సార్‌ ఆనాడు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారానే ఎంతోమంది పేద విద్యార్థులు ఐటీ కోర్సులు చదువుకుని ఉద్యోగులయ్యారు. ఆయన రుణం తీర్చుకునేందుకు సీఎం జగన్‌ కోసం ప్రచారం చేస్తాం. – సింధు, ఐటీ ఉద్యోగి, హైదరాబాద్‌దమ్మున్న సీఎం జగన్‌..

మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అంటున్న ఏకైక సీఎం జగన్‌ మాత్రమే. ఆ మాట అనటానికి ఎంత దమ్ముండాలి. ఏ సీఎం ఇవ్వని విధంగా జగన్‌ 4.93 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఇందులో పర్మినెంట్‌ ఉద్యోగాల వివరాల్ని తీసుకుంటే 2 లక్షల 13వేల 662 మందికి అవకాశం దక్కింది. ఇంకా కొన్ని వ్యవస్థల్లో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతూనే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ కోసమే దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీచేశారు.

అంతేకాక.. వైద్యరంగంలో దాదాపు 50వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చారు. అదే చంద్రబాబు హయాంలో కేవలం 34వేల పోస్టుల్ని మాత్రమే భర్తీచేసి ఇప్పుడు ఉద్యోగాలెక్కడ అంటూ రోజుకోసారి ఎల్లో మీడియాలో ఊదరగొడతున్నారు. మంచి చేసిన సీఎంకి ఐటీ ఉద్యోగులందరం మంచి చేయాలనుకున్నాం. అందుకే ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తాం. – స్వర్ణలత, విశాఖపట్నం, ఐటీ ఉద్యోగి 

Advertisement
 
Advertisement