యువకుడి ప్రాణం తీసిన రీల్స్‌ | Teenager Died While Taking Reels In Kurnool | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన రీల్స్‌

Oct 11 2024 11:26 AM | Updated on Oct 11 2024 1:09 PM

Teenager Died While Taking Reels In Kurnool

సోషల్‌ మీడియాలో క్రేజ్ కోసం రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. కర్నూలు జిల్లా కోసిగికి చెందిన చిన్నన్నపల్లి తిమ్మయ్య,లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు ఆంజనేయులు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో గుర్తింపు కోసం రీల్స్‌ చేయడం అలవాటు చేసుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఉరుకుందు వైపు బైక్‌పై వెళుతూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో యువకుడి కళ్లకు ఖర్చీఫ్‌ అడ్డు పడింది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించలేకపోయాడు.

సాయిబాబా ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే కిందపడ్డాడు.తీవ్రంగా గాయపడిన ఆంజనేయను చికిత్స నిమిత్తం ఆదోనీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement