
ఖజానాను కొట్టి టీడీపీ సిండికేట్‌కు పెట్టేలా ప్రభుత్వం అడుగులు
దరఖాస్తులు ఎవ్వరూ దాఖలు చేయకుండా వారి ద్వారా ఎత్తులు
మొత్తం 840 బార్లలో ఇప్పటివరకు కేవలం 45 బార్లకే దరఖాస్తులు
అస్మదీయులకు లాభాల మార్జిన్
పెంచేందుకే పకడ్బందీగా స్కెచ్
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే పన్నాగం
2015 దోపిడీ కుట్రనే పునరావృతం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ‘బార్ల లైసెన్సులకు మేం దరఖాస్తు చేయం.. ఇతరులను చేయనివ్వం’ ఇదీ టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో ప్రస్తుతం సాగిస్తున్న హైడ్రామా. ఇందులో మతలబు ఏంటంటే.. మద్యం విక్రయాల ద్వారా భారీ లాభాలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పన్నాగం రచిస్తున్నారు. దరఖాస్తులు దాఖలు కాలేదు కాబట్టి లాభాల మార్జిన్‌ను “సిండికేట్’ కోరినంతగా పెంచేందుకు తలొగ్గాల్సి వచి్చందని వారు పకడ్బందీగా ఆడుతున్న దొంగాట ఇది.
టీడీపీ ముఠా రక్తికట్టిస్తున్న బార్ల లైసెన్సుల నాటకం గూడుపుఠాణీ ఏమిటంటే.. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు ఇంకా 24 గంటలు మాత్రమే గడువు ఉంది. కానీ, సోమవారం నాటి పరిస్థితి ఏమిటంటే.. దాదాపు 2,300 దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వాటిలో కేవలం 72 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి.
వీటిలో కూడా కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలైన బార్లు కేవలం 45 మాత్రమే. కనీసం నాలుగు దరఖాస్తులు వచి్చన బార్లకే లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామని ప్రభుత్వ బార్ల పాలసీ ప్రకటించింది. అంటే.. 840 బార్లలో లాటరీ ద్వారా లైసెన్సు ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నవి కేవలం 45 బార్లే. మరోవైపు.. దరఖాస్తుల దాఖలుకు మంగళవారం
టీడీపీ గూండాలు, పోలీసులతో బెదిరింపులు
ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజి్రస్టేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని టీడీపీ నేతలు గుర్తిస్తున్నారు. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.
పోనీ.. టీడీపీ సిండికేట్ సభ్యులు అయినా ఒక్కో బార్‌కు కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు చేశారా అంటే అదీ లేదు. ఎందుకంటే.. అడ్డగోలు లాభాలు కొల్లగొట్టేలా బార్ పాలసీలో మార్పులు చేయాలన్నదే వీరి అసలు పన్నాగం. ఇందుకోసం రెండు నెలలుగా సిండికేట్–ప్రభుత్వ పెద్దల మధ్య మంతనాలు సాగాయి.
పచ్చముఠా పన్నాగం ఇదీ..
ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మారిŠజ్‌న్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం.
మార్జిన్ ఎక్కువ వచ్చేలా ‘ఇన్‌వాయిస్’ ధర తగ్గింపు..
ప్రస్తుతం బార్లకు 105 శాతం ఇన్వాయిస్ ధరకు మద్యం సరఫరా చేస్తున్నారు. అంటే.. ఒక మద్యం బాటిల్ ఎంఆర్‌పీ రూ.100 అనుకుంటే, ఆ బాటిల్‌ను రూ.105 చొప్పున ఇన్వాయిస్ ధరకు బార్లకు సరఫరా చేస్తున్నారు. ఈ బాటిల్‌ను బార్ల యజమానులు రూ.120కు వినియోదారులకు విక్రయిస్తున్నారు. తద్వారా బార్ల యజమానులకు ఒక్కో బాటిల్‌పై రూ.15 మార్జిన్ వస్తోంది. అయితే, ఈ మార్జిన్‌ను వీలైనంత ఎక్కువగా పెంచి వారికి మరింత మేలు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం బార్లకు సరఫరా చేసే ఇన్వాయిస్ ధర తగ్గించాలని ఎత్తులు వేస్తోంది.
అంటే.. 105 శాతంగా ఉన్న ఇన్వాయిస్ ధరను 90 శాతంగా నిర్ణయించాలని బావిస్తోంది. తద్వారా రూ.100 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిల్‌ను రూ.90కే బెవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఆ బాటిల్‌ను ఎంతకు విక్రయించాలన్నది మాత్రం ప్రభుత్వం కచి్చతంగా చెప్పదు. బార్ల యజమానులు మాత్రం యథావిథిగా రూ.120కే విక్రయిస్తారు. అంటే.. ఒక్కో బాటిల్‌పై వారికి రూ.30 చొప్పున లాభం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఒక్కో బాటిల్‌పై రూ.15 చొప్పున చిల్లు పడుతుంది. దీనినిబట్టి టీడీపీ మద్యం సిండికేట్‌కు అడ్డగోలుగా లాభాలు వచ్చేలా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే చంద్రబాబు ప్రభుత్వ ఎత్తుగడ అన్నది స్పష్టమవుతోంది.
నాడూ ఇదే పన్నాగంతో దోపిడీ..
2015లో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును చీకటి జీవోలతో రద్దుచేసి ఏడాదికి రూ.1,300 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలని మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి విజ్ఞప్తి వచ్చినట్లు కథ నడిపించి.. అందుకే అది రద్దు చేసినట్లు బిల్డప్ ఇచ్చింది.
అది కూడా కేబినెట్‌ను బురిడీ కొట్టించి రెండు చీకటి జీవోలు జారీచేసి ఆ ఫీజు రద్దు చేసేసింది. ఇప్పుడు కూడా అదే రీతిలో ఇన్వాయిస్ ధరను తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. అదే సమయంలో టీడీపీ సిండికేట్‌కు జేబులు నింపేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
బార్ల లైసెన్స్ ఫీజులకూ కోత?
బార్ల లైసెన్స్ ఫీజు కూడా భారీగా తగ్గించాలని ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.75 లక్షల కేటగిరీ ఫీజును రూ.40 లక్షలకు.. రూ.55 లక్షల కేటగిరీ ఫీజును రూ.30 లక్షలకు, రూ.35 లక్షల కేటగిరీ ఫీజును రూ.20 లక్షలకు తగ్గించేలా పావులు కదుపుతోంది.