ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ | TDP MP Lavu Sri Krishna Devarayalu Faces Protests At Chilakaluripet | Sakshi
Sakshi News home page

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ

Aug 27 2026 6:31 PM | Updated on Aug 27 2026 9:15 PM

TDP MP Lavu Sri Krishna Devarayalu Faces Protests At Chilakaluripet

పల్నాడు: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి  వెళ్లిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసిన మృతుని బంధువులతో వినతిపత్రం  ఇవ్వండి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. 

దాంతో కంగుతిన్న మృతుని బంధువులు దేనికి వినతిపత్రం ఇవ్వాలంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయల తీరుపట్ల మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దళితులు చనిపోతే న్యాయం చేయడానికి వినతిపత్రం ఇవ్వాలా? అంటూ ఎంపీని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ఎంపీ ముందు నినాదాలు చేశారు ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసకున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ నిరసన చేపట్టారు. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

అలా జరగకపోయి ఉంటే.. సాధిక్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరంటే?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement