23వ రోజుకు చేరిన 3 రాజధానులకు మద్దతుగా దీక్షలు

Strikes Of Support 3 Capitals Reached 23 Day In Amaravati  - Sakshi

సాక్షి, గుంటూరు: మూడు రాజధానులకు మద్దతుగా అమరావతి రాజధాని తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు భారీ స్థాయిలో మహిళలు తరలి వస్తున్నారు. మహిళ, దళిత, ప్రజా సంఘాల మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. చదవండి: 3 రాజధానులకు అమరావతిలో అనూహ్య మద్దతు

కాగా బుధవారం నాటి దీక్షలకు ముఖ్య అతిథిగా మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొండపల్లి గిరిజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధాని అంటూ ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతోంది కేవలం తన బినామీలకు అడ్డాగా మార్చుకునేందుకేనని అన్నారు. అన్ని వర్గాలకు పాలనను చేరువ చేసేలా, సమాన అభివృద్ధే ధ్యేయంగా మూడు రాజధానులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తే చంద్రబాబు దానిని అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top