భావనపాడు కలపై.. అచ్చెన్న కుయుక్తులు!

Srikakulam TDP leaders becoming an Obstacle for Development - Sakshi

నిర్వాసితులను రెచ్చగొడుతూ అడ్డుకునే యత్నాలు 

జిల్లా ప్రజల దశాబ్దాల కలను కల్లలు చేసే ఎత్తుగడలు 

అభివృద్ధికి మోకాలడ్డుతున్న పచ్చ బ్యాచ్‌ 

సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధికి టీడీపీ నేతలు అడ్డంకిగా మారుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లో ప్రగతిని అడ్డుకుంటున్నారు. వారే మరోవైపు అభివృద్ధి జరగడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చేందుకు ప్రయత్నిస్తే న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం వాటిన్నింటిని అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది.

ఇటీవల పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ప్రకటిస్తే.. విశాఖ రాజధాని వద్దంటూ తమ రియల్‌ ఎస్టేట్‌ భూముల కోసం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్న కుట్రలతో ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారు. తాజాగా భావనపాడు పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్ధమై భూసేకరణ చేస్తుంటే కుట్రలకు దిగుతున్నారు. తమ అనుయాయులను రెచ్చగొట్టి, గలాటా సృష్టించి రాజకీయ ముసుగులో చలి కాచుకుంటున్నారు. పోర్టు వద్దనే నినాదంతో కొందర్ని వెనకుండి నడిపిస్తున్నారు.   

దశాబ్దాల నాటి కల..  
జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు ని ర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లాకు మేలు జరిగే ప్రాజెక్టు ఇది. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడి శా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు జల మా ర్గంలో అతి తక్కువ దూరం కలిగిన పోర్టు మరొకటి లేదు.  

►టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్‌ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నా యి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్న గ్రానైట్‌కు సంబంధించి 65 గ్రానైట్‌ క్వారీలు, వందకు పైగా పాలిషింగ్‌ యూనిట్లు ఇక్కడే ఉన్నాయి. ఈ గ్రానైట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ చేసేందుకు పోర్టు ఉపయోగపడుతుంది.  
►జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 11 మండలాల పరిధిలో 145 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది చేపల వేట సాగిస్తున్నారు. జాతీయ స్థాయి లో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్‌ సెక్టార్‌ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటానే ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క 2020– 21లో లక్షా 95వేల 230 మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద లభించింది. ఇలాంటి సంపదకు మంచి మార్కెట్‌ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది.  
►ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు అనుకూల మని ఇప్పటికే నిపుణులు సూచించారు. ముఖ్యంగా సముద్ర ఆధారిత ఆదాయం పెంచుకునేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది.  

భూసేకరణలో నిమగ్నం.. 
పోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఫేజ్‌ 1 పనులను చేపట్టేందుకు విశ్వ సముద్ర గ్రూప్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ప్రస్తుతం భూసేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. 675.60 ఎకరాలను సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు భూములు 433.71 ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్‌ తీరం కలిపి 241.89 ఎకరాలు ఉన్నాయి.

టెక్కలి మండలం బూరగాంలో 32.78ఎకరాలు, పాత నౌపడలో 5.50 ఎకరాలు, కొండ భీంపురంలో 5.69 ఎకరాలు, నందిగాం మండలంలోని డిమ్మిలాడలో 21.17 ఎకరాలు, నర్సీపురంలో 12.15 ఎకరాలు, దేవలబద్రలో 3.56 ఎకరాలు, సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో 27.38 ఎకరాలు, కస్పా నౌపడలో 5.17 ఎకరాలు, రాజపురంలో 320.31 ఎకరాల సేకరణ కోసం ఇప్పటికే రైతులతో సంప్రదింపులు చేసింది. సేకరించిన భూముల్లో రోడ్డు కనెక్టవిటీ కోసం 327.75 ఎకరాలు, రైల్వే కనెక్టవిటీ కోసం 100.27ఎకరాలు, మిగతాది పోర్టు కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు. రైతులంతా సానుకూలత వ్యక్తం చేశారు.  

మెరుగైన పరిహారం  
టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతుల భూములను సేకరిస్తుండగా, మరోవైపు పోర్టు కో సం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోని 420 కట్టడాలు ప్రభావితమవుతున్నాయి. వీరికి పునరావా సం కల్పిస్తున్నారు. విష్ణు చక్రం గ్రామానికి చెందిన వారికి కె.లింగుడు, సంతబొమ్మాళి, మూలపేటకు చెందిన వారికి కె.లింగుడు, ఇజ్జుపురంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 20లక్షలు పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారి ఇంటిలో ఉన్న 18 ఏళ్ల పైబడిన వయసు కలిగిన 590 మందికి రూ.10లక్షలు చొప్పున పీడీఎఫ్‌ ప్యాకేజీ ఇస్తున్నారు. 434 మందికి ఇంటి నిర్మాణం కోసం ఐదు సెంట్ల భూమి ఇచ్చి మోడల్‌ ఆర్‌ఆండ్‌ఆర్‌ కాలనీగా తీర్చిదిద్దనున్నారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నారు. దీంతో అక్కడి రైతు లు, ఇళ్లు కోల్పోతున్న వారు అంగీకారం తెలిపారు.    

రెచ్చగొట్టే పనిలో అచ్చెన్న అండ్‌కో.. 
భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వే, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లో కొందరు గలాటా సృష్టిస్తున్నారు. పోర్టుకు వ్యతిరేకంగా కేకలు వేయడం, పోర్టు వద్దని నినాదాలు చేయడం వంటివి చేస్తున్నారు. భావనపాడు నిర్మాణం జరిగితే టీడీపీకి ప్రజలు ముఖం చాటేస్తారన్న భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుంది. ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు మేలు జరిగితే తమ చెప్పు చేతుల్లో ఉండరనే అభద్రతా భావం అచ్చెన్న అండ్‌కోకు వెంటాడుతోంది.

జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టును కుట్రపూరితంగా అడ్డుకునే పనిలో పడ్డారు. తమ మాటలను నమ్మే కొందరిని రెచ్చగొట్టి పోర్టు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. జిల్లా చిరకాల కల ను భగ్నం చేసే పనిలో పడ్డారు. గతంలో ఇళ్ల స్థలాల విషయంలో ఇదే రకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పి కొట్టి ప్రభు త్వం పేదలకు మేలు చేసింది. ప్రస్తుతం విశాఖ రాజధాని విషయంలో అదే రకంగా అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజధాని వస్తే తమ రాజకీయాలు చెల్లవని, అమరావతిలో ఉ న్న భూములకు విలువ తగ్గి నష్టపోతామన్న భ యంతో విషం చిమ్ముతున్నారు. ఇప్పుడా జాబి తాలోకి భావనపాడు పోర్టును చేర్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top