సిక్కోలు బిడ్డ ఖ్యాతి: అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణాలు

Srikakulam Girls won Three Gold Medals in in international Dance Competition - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్‌ శిష్యురాలు అన్నా నేహాథామస్‌ అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణపతకాలు గెలుచుకున్నారు. ఐసీఎండీఏ చెన్నై, గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ న్యూఢిల్లీ వారు ఇటీవల అంతర్జాతీయ నాట్య పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అన్నా నేహా థామస్‌ కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో కూచిపూడి, భరతనాట్యంలలో రెండు స్వర్ణాలు, ఐసీఎండీఏ చెన్నైవారు నిర్వహించిన భరతనాట్యం పోటీలో స్వర్ణ పతకం అందుకుంది. ఈ సందర్భంగా అన్నా నేహా థామస్‌కు పలువురు అభినందనలు తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top