సీఎం జగన్‌ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు

Sirivennela Seetharama Sastry Family Members Meet CM Jagan - Sakshi

తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వరశర్మ, రాజా, కుమార్తె శ్రీలలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌ శాస్త్రిలు మర్యాదపూర్వకంగా కలిశారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌ను కలిసి సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, తమ కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్‌తో సిరివెన్నెలకు ఉన్న అనుబంధాన్ని  సీఎంతో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబానికి అవస­రమైన సాయం చేసేందుకు ప్రభు­త్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్‌ మరోమారు భరోసానిచ్చారు.
చదవండి: తెలుగు నేలపై విరిసిన పద్మాలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top