Sandalwood Smuggling: పోలీసుల అదుపులో స్మగ్లర్‌ చంద్రబాబు?

Sandalwood Smuggler Chandrababu in Police Custody - Sakshi

సాక్షి, ఎర్రావారిపాళెం(చిత్తూరు): తలకోన అడవుల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న బడా ఎర్రచందనం స్మగ్లర్‌ చంద్రబాబును రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. దుంగలు నరికి తన సరంజామాతో నెరబైలు సమీపంలో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అతనితో పాటు ఎర్రావారిపాళెంకు చెందిన మరో ఇద్దరు, తిరుపతి కరకంబాడికి చెందిన ఇద్దరు, గంగవరం మండలానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కొంత మంది తప్పించుకు పారిపోగా గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం.  

ఇదీ చంద్రబాబు చరిత్ర.. 
చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చంద్రబాబు గత 12 ఏళ్ల క్రితం స్మగ్లింగ్‌ కూలీగా చేరి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో డాన్‌గా ఎదిగాడు. ఎర్రావారిపాళెం, రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే 8 కేసులు ఉన్నాయి. 2011లో ఎర్రావారిపా ళెం పోలీస్‌స్టేషన్‌లో 2011లో 5కేసులు, 2012లో ఒక కేసు, 2015లో రొంపిచర్లలో  ఒక కేసు, 2019లో ఎర్రావారిపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడు. తాజాగా మంగళవారం ఎర్రదుంగలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. టీడీపీ హయాంలో విచ్చల విడిగా వ్యాపారం చేసి కోట్లు, స్థిరాస్తులు కూడబెట్టాడని ప్రచారంలో ఉంది. తలకోన అడవుల నుంచి ఎర్రదుంగలు తరలించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 

చదవండి: (టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top