స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే..

Sajjala Ramakrishna Reddy Announced YSRCP Candidates For Local Body MLC - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 11 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని చెప్పారు. ఇప్పుడిస్తున్న 14 స్థానాలతో కలిపి మొత్తం 32 స్థానాల్లో 18 మంది సభ్యులు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు. శాసనమండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌కే దక్కిందని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు. సీనియర్‌ నాయకులతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం ఖరారు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చే మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, పాలవలస విక్రాంత్, ఇసాక్‌ బాషా, డీసీ గోవిందరెడ్డిల పేర్లను ప్రకటించామని గుర్తు చేశారు.

14 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఇందులో 7 స్థానాలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించగా.. మిగిలిన 7 స్థానాలను ఓసీలకు కేటాయించారన్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సీట్లు కేటాయించారన్నారు. కౌన్సిల్‌ చరిత్రలో తొలిసారి నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..

►వరుదు కళ్యాణి (విశాఖపట్నం)


►ఇందుకూరు రఘురాజు (విజయనగరం)


►వంశీకృష్ణ యాదవ్‌ (విశాఖపట్నం)


►అనంత ఉదయ్‌భాస్కర్‌ (తూర్పుగోదావరి)


►మొండితోక అరుణ్‌కుమార్‌ (కృష్ణా)


►తలశిల రఘురాం (కృష్ణా)


►ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)


►తూమాటి మాధవరావు (ప్రకాశం)


►మూరుగుడు హన్మంతరావు (గుంటూరు)


►కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌ (చిత్తూరు)


►వై.శివరామిరెడ్డి (అనంతపురం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top