సాయికృష్ణ కేసులో వాటిని భద్రపరచాలని కోర్టు ఆదేశం | Saikrishna Case Key Orders from Vijayawada Court | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో వాటిని భద్రపరచాలని కోర్టు ఆదేశం

Jun 18 2026 4:37 PM | Updated on Jun 18 2026 4:52 PM

Saikrishna Case Key Orders from Vijayawada Court

విజయవాడ రెండో ఏజేఎం కోర్టు గాదె సాయికృష్ణ కేసులో కీలక ఉత్తర‍్వులు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్‌ భద్రపరచాలని ఆదేశించింది. సీసీ ఫుటేజ్‌తో పాటు కాల్‌డేటాను కూడా భద్రపరచాలని కోర్టు చెప్పింది. 

కాగా, గాదె సాయి కృష్ణ లాకప్‌ డెత్‌కు గురయ్యారనే వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. గాదె సాయి కృష్ణ నెల రోజుల క్రితం కనపడకుండాపోయారు. ఆయన ఆచూకీ గల్లంతయిన కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. 

ఆ సమయంలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ 29లోగా బాధితుడిని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని చెప్పింది. కాగా, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని.. మార్కాపురం జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియాకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement