AP: ప్రగతి బాటలుగా ప్రధాన రహదారులు

Roads Connecting The district Centers Congested - Sakshi

రయ్‌రయ్‌ మంటూ..రహదారులకు మహర్దశ

రూ.207.55 కోట్లతో అభివృద్ధి

71 పనులకు ఆమోదం

బ్రిడ్జిల నిర్మాణానికి సైతం ఏర్పాట్లు

ప్రధాన రహదారులు ప్రగతి బాటలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే రోడ్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు డివిజన్ల పరిధిలో రూ.207.55 కోట్లను కేటాయించగా పనులు ముమ్మరంగా జరిగేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు.                   – సాక్షిప్రతినిధి, ఏలూరు 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో వందల కోట్లతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 71 పనులకు రూ.207.55 కోట్లు కేటాయించారు. ఏలూరు, కొవ్వూరు, భీమవరం ఆర్‌అండ్‌బీ డివిజన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 3,219 కిలోమీటర్ల రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనిలో 44 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లు, 792 కిలోమీటర్ల మేర డబుల్‌ లైన్, 2,383 కిలోమీటర్ల మేర సింగిల్‌ లైన్‌ రహదారులు ఉన్నాయి.  

అనుసంధాన రహదారులపై ప్రత్యేక దృష్టి 
జిల్లా రోడ్లపై ముందుగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం పూర్తిస్థాయిలో నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాలకు అనుసంధానంగా ఉండే జంగారెడ్డిగూడెం–ఏలూరు, చింతలపూడి–ఏలూరు, ఏలూరు–భీమవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, నరసాపురం–భీమవరం, నిడదవోలు–కొవ్వూరు ఇలా ప్రతి పట్టణానికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ౖMðకలూరు, భీమవరంలో రోడ్ల పనులు పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.  

ఎన్‌డీబీ నిధులతో..  
 నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధుల ద్వారా ఫేజ్‌–1లో 11 రోడ్ల పరిధిలో 74 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్‌–2లో 13 రోడ్ల పరిధిలో 108 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు.    సీఆర్‌ఐఎఫ్‌ పథకం ద్వారా 29 కిలోమీటర్ల మేర 3 రోడ్ల పనులను చేయనున్నారు.  
రాష్ట్ర రహదారులపై గోతులు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  హై లెవిల్‌ బ్రిడ్జిలకు నిధులు 
ఉమ్మడి జిల్లాలో రూ.29.50 కోట్లతో 3 హైలెవిల్‌ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వంతెనల మరమ్మతులకు సైతం సన్నాహాలు చేస్తున్నారు.  

డివిజన్ల వారీగా.. 
 ఏలూరు డివిజన్‌ పరిధిలో రూ.9 కోట్లతో 5 పనులను పూర్తిచేయగా.. రూ.76 కోట్లతో 21 పనులు జరుగుతున్నాయి.  కొవ్వూరు డివిజన్‌ రూ.5.41 కోట్లతో 3 పనులను పూర్తిచేయగా.. రూ.74.43 కోట్లతో 21 పనులు పలు దశల్లో ఉన్నాయి. రూ.11 లక్షలతో ఐదు రో డ్లు పూర్తిచేయగా.. రూ.30 లక్షలతో 15 పనులు పలు దశల్లో ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top