‘ఆర్‌జీయూకేటీ సెట్’ విజయవంతం

RGUKT CET 2020 Exam Successfully Completed - Sakshi

సాక్షి, విజయవాడ: ‘ఆర్‌జీయూకేటీ సెట్-2020‌’ పరీక్ష విజయవంతంగా ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 638 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 85,760 మంది విద్యార్థులు హాజరయ్యారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో  97.61 శాతం, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో  95.38 శాతం విద్యార్థులు  హాజరయ్యారు. పరీక్షపై అభ్యంతరాలుంటే ఈ నెల 7 వతేదీ సాయంత్రం 5 గంటలలోపు www.rgukt.in లో నమోదు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన " కీ " ని 8న విడుదల చేస్తామని ఆర్‌జీయూకేటీ ఎగ్జామినేషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top