విద్యాలయాలుగా ఆర్బీకేలు 

RBKs turns into Schools - Sakshi

యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా కూడా మారిన ఈ కేంద్రాలు 

సాక్షి, అమరావతి :  అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) యూనివర్సిటీల్లో పాఠ్యాంశమయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వెటర్నరీ, కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్‌ తరగతులుగా కూడా మారాయి. యూనివర్సిటీలు, అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు ఇక నుంచి విధిగా ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్‌ నిర్వహించేలా మార్పుచేశారు. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విద్యార్థులు ఇందుకు శ్రీకారం చుట్టగా, మత్స్య యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.  

విజ్ఞాన భాండాగారాలుగా ఆర్బీకేలు.. 
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఆర్బీకేలు రెండున్నరేళ్లుగా రైతులకు విశేష సేవలందిస్తూ అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేశారు. వన్‌స్టాప్‌ సెంటర్‌గా వీటిని తీర్చిదిద్దారు. బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, నాన్‌ సబ్సిడీ విత్తనాలు, పురుగుల మందులతోపాటు ఎరువులను రైతు ముంగిటకు సరఫరా చేస్తున్నారు. వీటికి అనుబంధంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల ద్వారా అద్దెకు సాగు యంత్రాలనూ అందుబాటులోకి తెచ్చారు.

అలాగే, ఆర్బీకేల్లో ఏర్పాటుచేసిన కియోస్‌్కలు, డిజిటల్, స్మార్ట్‌ గ్రంథాలయాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక పోకడలు, మెళకువలను మారుమూల రైతులకు అందిస్తూ వాటిని నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దారు. ఇక వీటిల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లలో రెండు కోట్ల మందికి పైగా రైతులు వీటి ద్వారా సేవలందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టగా, పలు దేశాల ప్రతినిధులూ ఇక్కడికొచ్చి వీటిపై అధ్యయనం చేశారు.  

ఈ కేంద్రాల్లో ఇంటర్న్‌షిప్‌ 
సాధారణంగా.. మెడికోలకు బోధనాస్పత్రుల్లోనూ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సంబంధిత పరిశ్రమల్లోనూ చివరి ఏడాది ఇంటర్న్‌షి ప్‌ ఉంటుంది. అదేరీతిలో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులను జిల్లా కేంద్రాల్లో ఉండే డాట్‌ సెంటర్లకు, మిగిలిన వర్సిటీలు రీసెర్చ్‌ స్టేషన్, కేవీకేలకు అటాచ్‌ చేసేవారు. వాటి పరిధిలో ఓ వారం పదిరోజుల పాటు విద్యార్థులు స్టడీ చేసేవారు. ప్రస్తుతం ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షిప్‌ నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది.

ఉద్యాన విద్యార్థులకు ఆర్నెల్లు, వ్యవసాయ విద్యార్థులకు మూడు నెలలు, వెటర్నరీ విద్యార్థులకు నెలరోజుల చొప్పున ఇంటర్న్‌షి ప్‌ నిర్వహించేలా ఆయా యూనివర్సిటీ వీసీలు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం 20 నుంచి నెలరోజులపాటు ఇంటర్న్‌షి ప్‌ ఉండేలా మత్స్య యూనివర్సిటీ కూడా షెడ్యూల్‌ రూపొందిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో ఈ ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టారు.  

ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్‌ కార్నర్‌ 
ఇక ఇంటర్న్‌షి ప్‌ కోసం ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్‌ కార్నర్‌ను ఏర్పాటుచేశారు. రీసెర్చ్, ఎక్స్‌టెన్షన్‌ సెంటర్ల శాస్త్రవేత్తలతో పాటు స్థానిక అధికారులు, ఆర్బీకే సిబ్బందితో అనుసంధానం చేశారు. ప్రతీరోజు ఆర్బీకేలను విజిట్‌ చేస్తూ వాటి ద్వారా అందిస్తున్న  సేవలను పరిశీలించేలా షెడ్యూల్‌ రూపొందించారు. ప్రధానంగా ఇన్‌పుట్స్‌ సరఫరా, కియోస్‌్కల పనితీరు, వాతావరణ సమాచారం, నాలెడ్జ్‌ షేరింగ్, ఈ–క్రాప్‌ బుకింగ్, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సరీ్వస్, కొనుగోలు తీరు, ఆర్బీకే సిబ్బంది, బ్యాంక్‌ మిత్రల సేవలు, పశువులకు వ్యాక్సినేషన్, హెల్త్‌కార్డుల జారీ, సీహెచ్‌సీలు, పొలంబడులు, తోటబడులు, పశు విజ్ఞాన బడులు, వ్యవసాయ సలహా మండళ్ల పనితీరు, ఎఫ్‌పీఓలు, జేఎల్‌జీ గ్రూపుల పనితీరుతో పాటు పంటల బీమా, రైతుభరోసా, సున్నా వడ్డీ పంటల రుణాలు వంటి పథకాల అమలు తీరుతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు సమరి్పంచాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై విద్యార్థుల అధ్యయనాన్ని అంచనా వేస్తూ 5–10 మార్కుల వరకు ఇస్తారు.  
 

తరగతి గదుల్లో  ఆర్బీకేల గురించి.. 
ఈ నేపథ్యంలో.. రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్బీకేల అంశాన్ని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సీటీల్లో పాఠ్యాంశంగా చేర్చారు. గ్రామీణ ఆరి్థక వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్న వీటిæ గురించి తరగతి గదుల్లో బోధిస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? వాటి ఆవశ్యకత, లక్ష్యాలు, వాటి ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలు, రైతుల జీవితాల్లో ఆర్బీకేలు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి.. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆర్బీకేలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు.  

ఆర్బీకేల ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాం 
నేను బీఎస్సీ హానర్స్‌ ఫైనల్‌ ఇయిర్‌ చదువుతున్నా. నాతో పాటు మరో ఆరుగురు విద్యార్థులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఆర్బీకే పరిధిలో ఇంటర్న్‌షి ప్‌ చేస్తున్నాం. ఆర్బీకేల పనితీరు.. అందిస్తున్న సేవలను పరిశీలిస్తున్నాం. రోజూ ఫీల్డ్‌ విజిట్స్‌ చేస్తున్నాం. సాయంత్రం పూట రైతులతో భేటీ అవుతూ వారి సమస్యలకు సలహాలు, సూచనలిస్తున్నాం.  – దాసరి షీలా జయశ్రీ, పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థిని 
 
ఆర్బీకేల గురించి కాలేజీలో ఎంతో చెప్పారు 
నేను బ్యాచురల్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ చదువుతున్నా. ఏప్రిల్‌ నుంచి ఇంటర్న్‌షి ప్‌కు వెళ్లబోతున్నాం. ఈసారి ఇంటర్న్‌షి ప్‌లో ఆర్బీకేల విజిట్‌ను కూడా చేర్చారు. కాలేజిలో కూడా వాటి కోసం ఎంతో చెప్పారు. ఇంటర్న్‌షిప్‌లో వాటి పనితీరుపై ప్రత్యక్షంగా స్టడీ చేస్తాం.  – భూక్యాసాయి, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి 

సుశిక్షితులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం 
విద్యాబోధన తరగతి గదులకే పరిమితం కాకూడదు. వారు నేర్చుకున్న పాఠాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైనా అవగాహన పెంపొందించుకోవాలి. యూనివర్సిటీ నుంచి బయటకొచ్చేసరికి పరిశోధనలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్‌ నిర్వహిస్తున్నాం.  – డా.ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 
 
ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం 
ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం. ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టాం. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఐదు నుంచి ఆరుగురు చొప్పున ఒక్కో ఆర్బీకేకు అటాచ్‌ చేశాం.     – డాక్టర్‌ టి.జానకీరామ్, వీసీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top