ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభం

ration door delivery program successfully started in west godavari district kovvur town - Sakshi

సాక్షి, ఏలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహనాల్లో బియ్యాన్ని నింపుకున్న వాలంటీర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు రేషన్ షాప్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కోసం వారు ఒక రోజు పనిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. 

అయితే ప్రభుత్వమే ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో రేషన్ తీసుకోవడం చాలా సులభతరమైందని లబ్ధిదారులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేటాయించిన సమయానికి రేషన్‌ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. లబ్ధిదారుల కళ్లెదుటే బియ్యాన్ని కాటా వేసి, ప్రత్యేక సంచుల్లో వారికి అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇంటికే రావడంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top