రైలు ప్రమాదంలో గ్రామ వలంటీర్‌ మృతి 

Rail Accident Take Place Near Nuziveedu Village Volunteer Death - Sakshi

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: స్థానిక నూజివీడు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో గ్రామ వలంటీర్‌ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. నూజివీడు మండలం మొఖసా నరసన్నపాలెం గ్రామంలో బోయపాటి రవీంద్రకుమార్‌ (35) వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం మధ్యాహ్నం  రైలు ఢీకొనటంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనాస్థలికి చేరుకున్న ఏలూరు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన వలంటీర్‌ ఐడీ కార్డు ఆధారంగా మొఖసా నరసన్నపాలెం గ్రామ వలంటీర్‌ బోయపాటి రవీంద్రకుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే ఎస్‌ఐ వి.చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవీంద్రకుమార్‌ ప్రమాదవశాత్తూ రైలు క్రింద పడి మరణించడా లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top