ఏపీ: రైతు ఖాతాల్లోకి విద్యుత్‌ బిల్లుల సొమ్ము 

Payment Of Electricity Bills In Farmers Accounts In Srikakulam District - Sakshi

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.3,97,31,348 జమ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. జూన్‌ నెలలో జరిగిన విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించిన తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఈ మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి జీవోలో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top