ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడికి పాల్పడ్డారు. యువతిని తల్లిదండ్రులు, బంధువులు బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఐఎస్ రాఘవపురానికి చెందిన సంజిత్, కామవరపుకోట మండలం వెంకటాపురానికి చెందిన పద్మ.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పద్మ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 20న ఏలూరు అంబేద్కర్ నవ సమాజ్ సొసైటీలో ప్రేమజంట వివాహం చేసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అయితే గత రాత్రి ఐఎస్ రాఘవపురంలోని సంజిత్ ఇంటికి వెళ్లి వారిపై ఇనుప రాడ్లతో దాడి చేసిను పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. తన భార్యను తన వద్దకు చేర్చాలని బాధితులు సంజిత్ కోరుతున్నాడు. తమపై దాడి చేసి తన భార్యను ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని ద్వారకా తిరుమల పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు.


