పేదల స్థలాలను అడ్డుకుంటే పుట్టగతులుండవు

Ongoing Strikes In support of the three capitals - Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 

మూడు రాజధానులకు మద్దతుగా కొనసాగుతున్న దీక్షలు

తాడికొండ:  పేదలు, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపును అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీకి, దాని మిత్రపక్షాలకు పుట్టగతులు ఉండవని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా నరసింహులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
దీక్షలో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు   

రాష్ట్ర సమానాభివృద్ధి, వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించాల్సింది పోయి అభాండాలు వేసి అభాసుపాలు చేసేందుకు కోర్టులను ఆశ్రయిస్తూ చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారన్నారు. అవరోధాలతో అభివృద్ధిని ఆపలేరని, ప్రతి మనిషికీ కావలసిన కనీస సౌకర్యమైన సొంత స్థలం, ఇంటి నిర్మాణం కోసం రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తుంటే చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వికలాంగుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు కిరణ్‌రాజ్‌ మాట్లాడుతూ నిరుపేదలు, దివ్యాంగులను నిరాశ్రయులను చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్న బాబుకు తమ ఉసురు కచి్చతంగా తగులుతుందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top