
సాక్షి, ఢిల్లీ: ఏపీలో దాడులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీకి జాతీయ ఎస్టీ కమిషన్ సమన్లు జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీలపై దాడి ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. జిల్లాలో గిరిజన కుటుంబాలపై దాడి కేసులో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ , ఎస్పీకి ఎస్టీ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల ఎనిమిదో తేదీన తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. తమ ముందు హాజరు కాకుంటే కలెక్టర్, ఎస్పీపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ఏ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక, శ్రీకాకుళం జిల్లా ఎంపేడు గ్రామంలో ఎస్టీలపై జరిగిన దాడిపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి ఫిర్యాదు చేశారు.
