ఆదాయ పన్ను తగ్గించాలని ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి MP Vijayasai Reddy requests Modi for relief for taxpayers earning below 10 lakh. Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను తగ్గించాలని ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

Published Wed, Jun 19 2024 1:23 PM | Last Updated on Wed, Jun 19 2024 3:13 PM

mp vijayasai reddy request to modi over relief to 10 lakh below taxpayers

సాక్షి, తాడేపల్లి: పది లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్ను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రధనికి విజ్ఞప్తి చేశారు. 

‘దేశంలోని గ్రామీణ/అర్బన్ ప్రాంతాల్లో ఉంటూ ఏడాదికి రూ.10 లక్షలలోపు సంపాదించే వారికి ఆదాయపు పన్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. వారి ఆదాయపన్ను తగ్గించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా. ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతిని ప్రోత్సహించేందుకు పన్ను తగ్గిచండి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోండి’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement