దిశ మీటింగ్‌లో పోలీసులపై ఎంపీ పుట్టా మహేశ్‌ అసహనం | MP Putta Mahesh Expresses Anger Over Drunk Driving Cases | Sakshi
Sakshi News home page

దిశ మీటింగ్‌లో పోలీసులపై ఎంపీ పుట్టా మహేశ్‌ అసహనం

Jun 24 2026 11:37 PM | Updated on Jun 25 2026 12:55 AM

MP Putta Mahesh Expresses Anger Over Drunk Driving Cases

ఏలూరు జిల్లా: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై దిశ మీటింగ్‌లో ఎంపీ పుట్టా మహేశ్‌ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువ మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేసి, భారీగా చలాన్లు వేస్తున్నారంటూ ఎస్పీని ప్రశ్నించారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాలలో ఈ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయని పుట్టా మహేశ్‌ చెప్పారు. తనకు రోజూ వచ్చే కాల్స్‌లో 30 కాల్స్ ఇవేనని వాపోయారు. పల్లెల్లో కార్యకర్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

కేసుల కారణంగా మండల స్థాయి నాయకులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పల్లెల్లో ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు పోతాయని అవగాహన ప్రోగ్రాం చేద్దామని ఎంపీతో ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement