
సాక్షి, తూర్పు గోదావరి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సోమ, మంగళ వారాల్లో పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం వైఖరి వల్లే సవరించిన అంచనాల ఆమోదానికి ఆలస్యమైందని ఆయన విమర్శించారు. లక్షలాది క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రం పాలవడం బాధగా ఉందన్నారు. సత్వరం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని, సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని ఎంపీ భరత్ కోరారు.