మరింత అందుబాటులో ఎక్స్‌రే, సీటీస్కాన్‌

More available of  X-ray and CT scan also in secondary care hospitals - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 115 ఆస్పత్రుల్లో సేవలు 

ఎమర్జెన్సీ కేసులకు ప్రాధాన్యం  

సాక్షి, అమరావతి: ఎక్స్‌రే, సీటీస్కాన్‌ల కోసం గతంలో రోగులు ఇబ్బందిపడే వారు. జిల్లా ఆస్పత్రులు లేదా బోధనాస్పత్రుల్లో మాత్రమే అవి అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. సెకండరీ కేర్‌ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో మొత్తం 115 చోట్ల ఈ సేవలు అందుతున్నాయి. 

► రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1,531 మంది ఎక్స్‌రే సేవలను, నెలకు ఆరు వేల మందికి పైగా సీటీస్కాన్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. 
► మొత్తం 71 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 36 ఏరియా ఆస్పత్రులు, ఆరు జిల్లా ఆస్పత్రులు రెండు ఎంసీహెచ్‌ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండగా, మరిన్ని ఆస్పత్రులకు విస్తరించేలా చర్యలు చేపడుతున్నారు.  
► ఈ 115 ఆస్పత్రుల్లో మొత్తం 1,350 ఎక్స్‌రే మెషీన్లున్నాయి. ఎమర్జెన్సీ కేసులకు ప్రాధాన్యమిస్తున్నారు. 
► రేడియోగ్రాఫర్స్‌కు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top