
తిరుపతి జిల్లా: సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విచారణ చేపట్టింది. పేరెంట్స్ అసోసియేషన్ పిర్యాదుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.
గత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా 26 కోట్లు అదనంగా వసూలు చేశారని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ 15 లక్షలు రూపాయలు ఫైన్ విధించింది.
ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) తిరుపతిలో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం, 2022లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే.