చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ | MLC Iqbal fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్

Aug 3 2020 9:33 PM | Updated on Aug 3 2020 10:04 PM

MLC Iqbal fires on Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అమరావతి ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ విసిరారు. టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

శ్రీభాగ్ నుంచి శివరామకృష్ణన్ దాకా వికేంద్రీకరణకే నిపుణులు మొగ్గు చూపారని ఇక్బాల్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. రాయలసీమ ప్రజలను చంద్రబాబు గూండాల్లా చిత్రీకరించారని మండిపడ్డారు. టీడీపీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement