
రెండో విడత అడ్వాన్సు కింద మార్చి 11న రూ.2,704.71 కోట్లు విడుదల
ఇందులో ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో రూ.569.36 కోట్లు మాత్రమే జమ
మిగతా రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ జమ చేయని రాష్ట్ర ప్రభుత్వం
రాజ్యసభలో ఎంపీ గొల్ల బాబురావుకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి వెల్లడి
అంటే ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లేనని అధికార వర్గాల స్పష్టీ కరణ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిన వైనం రాజ్యసభ సాక్షిగా బట్టబయలైంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండో విడత అడ్వాన్సు కింద మార్చి 11న విడుదల చేసిన రూ.2,704.71 కోట్లలో ఇప్పటి వరకు కేవలం రూ.569.36 కోట్లనే ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసిందని, మిగతా నిధులు అంటే రూ.2,135.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని ఈ నెల 28న రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి స్పష్టం చేస్తూ సమాధానమిచ్చారు.
అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి, వాటిని పోలవరం పనులకు మాత్రమే వినియోగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. అయితే రూ.2,135.35 కోట్లను నాలుగున్నర నెలలుగా జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీన్ని బట్టి ఆ నిధులను ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించినట్లు స్పష్టమవుతోందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అడ్వాన్సు నిధులను ఇతర అవసరాలకు మళ్లించకపోతే ఇప్పటికీ ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వాటిని ఎందుకు జమ చేయలేదని ప్రశ్నిస్తున్నాయి.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేసేది. కేంద్రం రీయింబర్స్ చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే పోలవరం నిధులను మళ్లించేశారంటూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దు్రష్ఫచారం చేసేవాళ్లని.. ఇప్పుడు అడ్వాన్సుగా ఇచి్చన నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.