40 వేల హెక్టార్లలో పంట న‌ష్టం : క‌న్న‌బాబు | Minister Kannababu Inspected Flood Prone Areas In East Godavari | Sakshi
Sakshi News home page

40 వేల హెక్టార్లలో పంట న‌ష్టం : క‌న్న‌బాబు

Oct 17 2020 3:19 PM | Updated on Oct 17 2020 3:21 PM

Minister Kannababu Inspected Flood Prone Areas In East Godavari - Sakshi

తూర్పు గోదావ‌రి : వ‌ర‌దల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు తెలిపారు. వ‌ర‌ద‌ల‌తో గండ్లు ప‌డిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన మంత్రి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామ‌ని పేర్కొన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. ఏలేరు వరదలతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని,  ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి,  తీవ్రంగా ఉంద‌ని తెలిపారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేస్తున్నామ‌ని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారని మంత్రి  వెల్ల‌డించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement