మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు

Minister Botsa Satyanarayana Cabinet Reshuffle YS Jagan Visakha Lands - Sakshi

సాక్షి, తాడేపల్లి: రెండేళ్ల తర్వాత కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందే చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. 'సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని అందరూ ఆనందంగా ఆమోదించారు. సీఎం జగన్‌ ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తాం. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం.‌

పార్టీని, ప్రభుత్వాన్ని కోఆర్డినేట్‌ చేసుకుని ముందుకెళ్తాం. ఎవరిని కొనసాగించాలన్నది సీఎం జగన్‌ ఇష్టం. సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. మంత్రిగా ఉన్న.. పార్టీలో ఉన్న ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై సీఎం ప్రణాళిక ఇస్తారు. పాత కేబినెట్ మాదిరిగానే కొత్త మంత్రి వర్గంలో సామాజిక సమీకరణాలు ఉంటాయి' అని మంత్రి బొత్స అన్నారు.

చదవండి: (మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే..)

'విశాఖ భూములపై టీడీపీ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎన్‌సీసీ భూములపై 2019లో చంద్రబాబు కేబినెట్‌లో పెట్టారు. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు జీవో ఇచ్చారు. విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదే. జీవోలు ఇచ్చిన వారిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండని' మంత్రి బొత్స అన్నారు.

చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top