Kodali Nani: మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే..

AP Cabinet: Kodali Nani Comments After Resignation To The Minister Post - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ కేబినెట్‌ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 మంది మంత్రులు  రాజీనామా సమర్పించినట్లు తెలిపారు.  ఏప్రిల్‌ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తి ఉందన్నారు. ఇకపై శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.
చదవండి: మంత్రుల రాజీనామా: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

కాగా సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారని పేర్కొన్నారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు.
చదవండి: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top