Andhra Pradesh Ministers Submit Resignation Letters to CM YS Jagan - Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు

Apr 7 2022 5:14 PM | Updated on Apr 7 2022 6:18 PM

AP Ministers Submit Resignation to CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. 

చివరి కేబినెట్‌ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు.

చదవండి: (Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement