
సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన చిరుత చిత్రం
తిరుమలలోని గోగర్భం అటవీ శాఖ గార్డెన్ వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది.
తిరుమల: తిరుమలలోని గోగర్భం అటవీ శాఖ గార్డెన్ వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి అటవీ శాఖ గార్డెన్ కాపలాదారుని ఇంటికి సమీపంలో చిరుత సంచరించింది. చిరుత సంచారాన్ని కాపలాదారుని కుమారుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇటీవల తరచూ తిరుమల ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం పెరిగిన విషయం తెలిసిందే.