పగిలిన గుండె రక్తనాళానికి చికిత్స 

Kurnool Kims Hospital Rare treatment by angioplasty - Sakshi

కర్నూలులో అరుదైన వైద్యం

కర్నూలు(హాస్పిటల్‌): రక్తనాళంలో రక్తం గడ్డకట్టి రక్తనాళం చిట్లి గుండెపోటు వచ్చిన వ్యక్తికి కర్నూలులోని కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు యాంజియోప్లాస్టీ ద్వారా అరుదైన చికిత్స చేసి ప్రాణం కాపాడారు. ఆదివారం కార్డియాలజిస్టు డాక్టర్‌ చింతా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘గిద్దలూరుకు చెందిన నాగార్జునరెడ్డి(32)కి గతేడాది నవంబర్‌ 12న ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు  రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించారు. దీంతో అతను అదే రోజు కిమ్స్‌ హాస్పిటల్‌కు వచ్చాడు. యాంజియోగ్రామ్‌ చేయగా రక్తనాళం పగిలినట్లు తేలింది.

ఇది చాలా అరుదైన కేసు. ప్రపంచంలోనే 20వ కేసుగా పరిగణించవచ్చు. పైగా మిగతా 19 కేసుల కంటే భిన్నమైనది. రక్తనాళం పగలడంతో రక్తం గుండె చుట్టూ చేరుకుని ఒత్తిడికి గురిచేసింది. ఆ సమయంలో రోగి బీపీ తగ్గి వెంటనే మరణించే అవకాశం ఉంది. ఇతనిలో ప్రమాదాన్ని సాధ్యమైనంత తొందరంగా గుర్తించి పెర్క్యుటేనియస్‌ ట్రాన్స్‌లూమినల్‌ కరోనరి యాంజియోప్లాస్టీ చేసి రక్తప్రవాహాన్ని ఆపి ప్రాణాలు కాపాడాం. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడు’ అని వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top