హవాలా డబ్బు కలకలం

Krishna District : RS 80 Lakh Hawala Money Seized - Sakshi

గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా హవాలా నగదు పట్టివేత

రూ.80 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

సాక్షి, కృష్ణా : జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద హవాలా డబ్బు కలకలం రేపింది. వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. ఓ కారులో భారీ మొత్తంలో నగదు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాలా డబ్బును సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గోల్డ్‌ వ్యాపారి మహ్మద్‌ భాషాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. హవాలా రాకెట్ అసలు సూత్రదారులకోసం అరా తీస్తున్నారు. (చదవండి : ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ స్వాధీనం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top