ఆపదమిత్ర పథకం శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపిక

Krishna District Has Selected For Training Under Apadamitra Scheme - Sakshi

అమరావతి : విపత్తు నిర్వహణ కింద కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపదమిత్ర పథకంలో శిక్షణకు కృష్ణా జిల్లా ఎంపికైంది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా ఆరువేల మంది కమ్యూనిటీ వలంటీర్లను కేంద్రం  సిద్దం చేస్తుంది. దీనిలో భాగంగా   దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని 30 జిల్లాల్లో ఎంపిక చేసిన  వాలంటీర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలోని 200 మంది కమ్యూనిటీ వలంటీర్లను ప్రభుత్వం  గుర్తించింది. వారికి  ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ ద్వారా కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వ‌నుంది.  తీరప్రాంతాల్లో  అత్యవసర పరిస్థితులు, వరద సమయాల్లో అత్యవసరంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ సంస్థ   రాష్ట్రంలోని 9 జిల్లాల్లో హ్యామ్ రేడియో వ్యవస్థను ఏర్పాటు చేసింది. (రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ రైతు భరోసా సాయం )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top