Kommu Konam Fish: చిన్న పడవకు చిక్కిన పెద్ద చేప

Kommu Konam Fish Sale At High Price In Vizag  - Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంది. వచ్చే నెల వరకు సముద్రం చేప దొరకాలంటే కష్టం. ఈ పరిస్థితుల్లో ఆదివారం మత్స్యకారులకు కొమ్ముకోనం చేప కొమ్ము కాసింది. అదేంటి.. వేట విరామంలో ఇంత పెద్ద చేప ఎలా వలకు చిక్కిందని ఆలోచిస్తున్నారా? తెర పడవలపై పలువురు జాలర్లు రోజంతా కష్టపడితే కొమ్ముకోనం చేపలు విరివిగా పడతున్నాయి.

వేట విరామంలో ఇంజిన్‌ బోట్ల (మరపడవలు)తో వేట నిషేధం. కానీ తెర పడవల మీద వేటకు వెళ్లవచ్చు. వీరి కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుంది. అలా ఆదివారం భారీ సంఖ్యలో చేపలు వలకు చిక్కాయి. 80 కిలోల నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. 100 కిలోల చేప రూ.20 వేల పైబడి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. 6 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉండే ఈ చేపను కేరళవాసులు ఎంతో ఇష్టపడి తింటారు. ఒక్క వేటలో భారీగా చేపలు చిక్కడంతో మత్య్సకారులు సంతోషం వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top