
సాక్షి,విశాఖ: ఫిషింగ్ హార్బర్‌లో సమీపంలో విషాదం చోటు చేసుకుంది. హిమాలయ బార్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గురువారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ (Fishing Harber) ఏరియాలో సిబ్బంది వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలి ఇద్దరు ఘటన స్థలంలో మరణించారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో వెల్డింగ్ షాప్ ఓనర్ గణేష్, శ్రీను అనే వ్యక్తి మరణించగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.