ఏపీలో ‘రేషన్‌ డోర్‌ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం 

Karnataka Study On Ration Door Delivery In AP - Sakshi

పటమట (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌డోర్‌ డెలివరీ విధానాన్ని కర్ణాటక పౌర సరఫరాల కమిషనర్‌ అధికారి కనకవల్లి అధ్యయనం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని పరిశీలించారు.

చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్‌!

పటమట భాగయ్య వీధిలో ఉన్న డిపో నం 272కు చెందిన ఎండీయూ ఆపరేటర్‌ వాహనం వద్ద డీలర్‌ నుంచి స్టాకు ఎండీయూ ఆపరేటర్‌కు బదలాయింపు, ఆపరేటర్‌ నుంచి కార్డుదారులకు రేషన్‌ ఎలా ఇస్తున్నారనేది పరిశీలించారు. ఈ విధానంపై స్థానికుల నుంచి అభిప్రాయసేకరణ చేశారు. డోర్‌ డెలివరీపై ఆమెకు ఏఎస్‌వో సర్కిల్‌–2 కోమలి పద్మ, ఏపీ పౌర సరఫరాల కమిషనరేట్‌ అధికారులు పలు వివరాలు చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top