ఇది కదా జగనన్న పాలన..

నరసన్నపేట: అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లు చంద్రమౌళికి మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తోంది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాలన్నీ వివరించారు. చంద్రమౌళికి రైతు భరోసా కింద రూ. 38,500, సున్నా వడ్డీ కింద రూ.1,168, వైఎస్సార్ ఆసరా కింద రూ. 11,640 ప్రయోజనం కలిగినట్లు వివరించారు. బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే కృష్ణదాస్ జల్లు చంద్రమౌళికి ఇచ్చారు. ఇది కదా జగనన్న పాలన అంటే.. అని స్థానికులు చర్చించుకున్నారు.